చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

  • షాద్ నగర్ పట్టణ సీఐ ప్రతాప్ లింగం

ముద్ర/షాద్ నగర్ : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పట్టణ సీఐ ప్రతాప్ లింగం అన్నారు. శుక్రవారం పట్టణంలోని పరిగి రోడ్డు పోచమ్మ టెంపుల్ సమీపంలో పదో వార్డు కాలనీవాసి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ  ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని వివరించారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని వివరించారు. రోజురోజుకు ఎండల తీవ్రత ఎక్కువగా పెరిగిపోతుందని దాంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వివిధ గ్రామాల నుండి పట్టణ ప్రాంతాలకు వచ్చే ప్రజలు, బాటసారులకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. వేసవికాలం ముగిసే వరకు చలివేంద్రాన్ని కొనసాగించాలని దాత శ్రీనివాసచారికి సూచించారు. దాంతో కాలనీవాసులు శ్రీనివాసచారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నేతలతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.