వాసవీ మాత "అమ్మకు మనసారా మనసారే"

వాసవీ మాత "అమ్మకు మనసారా మనసారే"

ముద్ర, కోరుట్ల: కోరుట్ల వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం పలాజ్ కిట్టి పార్టీ అధ్వర్యం లో వాసవీ మాత "అమ్మకు మనసారా మనసారే" కార్యక్రమం ని నిర్వహించారు. ముందుగా కిట్టి పార్టీ సభ్యులు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం, అర్చన, వాసవీ మాత పారాయణం చేసారు.  అనంతరo అమ్మకు సారేను కానుకగా సమర్పించారు. అలాగే ముందస్తు హోలీ వేడుకలను సభ్యులు అంగరంగ వైభవంగా, ఒకరిపై ఒకరు కుంకుమ జల్లుకున్నారు. ఈ కార్యక్రమంలో కిట్టిపార్టీ సభ్యులు ఉప్పులపు నీరజ, అల్లాడి శోభ, చందన, నీలి అనురాధ, కొత్త శోభ, కోటగిరి శైలజ, కూరగాయల కల్పన, ఎలిమి శిరీష, ముక్క రజిత, బాశెట్టి వకుళ, మేడి వజ్రమాల, రేగొండ విజయ, నీలి రాధ, ఆర్య వైశ్య మహిళలు పాల్గొన్నారు