ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీ

ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీ

ముద్ర,హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్‌ను రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణ రావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ కృష్ణ మోహన్‌ రావు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.