సెర్ప్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు వేడుకలు

సెర్ప్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి పుట్టినరోజు వేడుకలు

ముద్ర, తెలంగాణబ్యూరో  సెర్ప్ ఉద్యోగులు  పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  పుట్టిన రోజు వేడుకలను ఆయా జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని మానసిక దివ్యాంగుల శుభోదయం పాఠశాల విద్యార్ధుల మధ్య సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంటు గంగాధర్ రెడ్డి కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలను సెర్ప్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్వహించారు.

సెర్ఫ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మొక్కలను నాటి మంత్రి ఎర్రబెల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుంటు గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. సెర్ఫ్ సిబ్బందికి పేస్కేల్ వర్తింపజేయటంలో మంత్రి ఎర్రబెల్లి కీలకపాత్ర పోషించారని అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధిక అవార్డులతో ఆదర్శంగా ఉండేలా మంత్రి ఎర్రబెల్లి ముందుండి నడిపిస్తున్నారని ఆయన తెలిపారు.