ఎన్టీఏను ప్రక్షాళన చేయాలి

ఎన్టీఏను ప్రక్షాళన చేయాలి

శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : నీట్ పరీక్ష అవకతవకల నేపథ్యంలో  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను ప్రక్షళన చేయాలని శివసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సింకారు శివాజీ డిమాండ్ చేశారు. ఎన్టీఏ నీట్ పరీక్షాపత్రం లీకేజ్ అయ్యిందని ఆయన ఆరోపించారు. పేపర్ లీకేజీకి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటపడతాయన్నారు.

ఈ మేరకు శుక్రవారం మీడియాతో సింకారు శివాజీ మాట్లాడారు.. నీట్ పేపర్ లీకేజీకి, ప్రధాని మోడీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నంచారు. నీట్ పరీక్ష పత్రం లీక్ అయితే ప్రతిపక్షాలు ప్రధాని మోడీని టార్గెట్ గా చేసుకుని మాట్లాడటం కూడదని ఆయన అన్నారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం సరైన చర్య కాదన్నారు. విద్యార్ధులకు నష్టం జరిగితే ప్రధాని మోడీ సహించబోరనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తు చేసుకోవాలన్నారు.