వైజాగ్ వన్డేలో స్టార్క్​ దెబ్బకు భారత్​ విలవిల.. 10 ఓవర్లకే ఐదుగురు ఔట్

వైజాగ్ వన్డేలో స్టార్క్​ దెబ్బకు భారత్​ విలవిల.. 10 ఓవర్లకే ఐదుగురు ఔట్

టెస్టు సిరీస్‌ చేజిక్కించుకొని, తొలి వన్డేలో ఉత్కంఠ విజయం సాధించి వైజాగ్ కు వచ్చిన టీమిండియా ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బ్యాటింగ్ తో తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఆస్ట్రేలియా స్టార్​ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు వణికిపోతోంది. పది ఓవర్లకు కూడా ముగియకముందే.. యాభై పరుగుల్లోనే సగం వికెట్లు కోల్పోయింది. ఇందులో నాలుగు మిచెల్ స్టార్క్ కే పడ్డాయి.

ఇన్నింగ్స్ మూడో బంతికే శుభ్ మన్ గిల్ (0) ఔటవగా.. ఐదో ఓవర్లో వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (0) వెనుదిరిగారు. ఆపై తొమ్మిదో ఓవర్లో కేఎల్ రాహుల్ (9)ను కూడా స్టార్క్ ఎల్బీగా వెనక్కు పంపాడు. సీన్ అబాట్ వేసిన తర్వాతి ఓవర్లోనే స్లిప్ లో స్టీవ్ స్మిత్ పట్టిన అద్భుత క్యాచ్ కు హార్దిక్ పాండ్యా (1) సైతం పెవిలియన్ చేరడంతో 49 పరుగులకే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ (22), రవీంద్ర జడేజా (2) పైనే భారత్ ఆశలున్నాయి.