విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి.
  • సబ్ ఇన్స్పెటర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ రెడ్డి.

మోత్కూర్,ముద్ర న్యూస్:విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని స్థానిక ఎస్ ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మంగళవారం మోత్కూర్ పట్టణ కేంద్రంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో పదవ తరగతి టాలెంట్ టెస్ట్ పేపర్ ను విడుదల చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మోత్కూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇట్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రానున్న వార్షిక పరీక్షల్లో విద్యార్థులు  మంచిగా పరీక్షలు రాసి విద్యార్థుల్లో ఉన్న భయాన్ని విడనాడి పరీక్షలు మంచిగా రాసి భవిష్యత్తు లో మంచి లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ఎస్ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో టాలెంట్ టెస్ట్ లు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం ఎస్ ఎఫ్ఐ పోరాటం చేస్తుందని అన్నారు. రానున్న వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ఐ మండల అధ్యక్షులు ఇంజ ప్రశాంత్,సెయింట్ ఆన్స్ ప్రిన్సిపాల్ మరియన్న,సీక్రెట్ హార్ట్ స్కూల్ భాస్కర్,లిటల్ ఫ్లవర్ ప్రతాఫ్ తదితరులు పాల్గొన్నారు.