అడిషనల్ కలెక్టర్ ని సన్మానించిన రేషన్ డీలర్లు

అడిషనల్ కలెక్టర్ ని సన్మానించిన రేషన్ డీలర్లు

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాకు నూతనంగా వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ భాస్కరు రావుని యాదాద్రి భువనగిరి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎలగల రాజయ్య ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ప్రసాదం అందజేశారు.  అడిషనల్ కలెక్టర్ డీలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ విధులను సక్రమంగా నిర్వహించాలని మీ సమస్యలను మా వంతు బాధ్యతగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రేషన్ డీలర్ల కార్యదర్శి  కందుల శంకర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తవిటి మల్లారెడ్డి,  అధ్యక్షులు మన్నె యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు సుర్వి వెంకటేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి సువర్ణ నర్సిరెడ్డి, భువనగిరి మండల అధ్యక్షులు గంగాదేవి మహేష్, కార్యదర్శి కూరాకుల శ్రీనివాస్, గుండాల డీలర్ అధ్యక్షులు హరి కిషన్, రామన్నపేట అధ్యక్షులు కుమార్, పోచంపల్లి అధ్యక్షులు లక్ష్మీపతి, కార్యదర్శి నరసింహ గౌడ్, తుర్కపల్లి అధ్యక్షులు కుకుటపు నవీన్ కుమార్, గౌరవ అధ్యక్షులు కందుకూరి అమర్, పోచంపల్లి, రాజపేట అధ్యక్షులు పోచయ్య, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు డీలర్ ఆకుల శ్రీనివాస్, ఉడుత రమేష్, అమృతమ్మ, కృష్ణ డీలర్లు పాల్గొన్నారు.