స్వర్ణ కారుల పై పోలీస్ వేధింపులను అరికట్టాలి : గూడూరు

స్వర్ణ కారుల పై పోలీస్ వేధింపులను అరికట్టాలి : గూడూరు
  • కలెక్టరేట్ ఎదుట స్వర్ణకారుల ఒక్కరోజు  నిరాహార దీక్ష

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు.  వారికి మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి పాల్గొని   మాట్లాడుతూ స్వర్ణ కారుల పై జరుగుతున్న పోలీస్ వేధింపులను అరికట్టాలని, ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న 5 మెన్ కమిటి రిపోర్టును యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క స్వర్ణ కారునికి నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, స్వర్ణ వృత్తి చేస్తూ మరణించిన స్వర్ణ కారులకు 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. స్వర్ణ కారులకు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ కారుల జిల్లా ప్రెసిడెంట్ కొండపర్తి బాల చారి, సంతోష్ కుమార్, గిరిధర్ చారి, కట్ట నర్సింహా స్వామి, దాసోజు బిక్షమ చారి, కొల్లోజు రఘు, అశోక్ చారి, దేవేంద్ర చారి, మునిగంటి సాయి, నర్సింహా చారి , కొళ్లోజు శ్రవణ్ కుమార్, కన్నె కంటి రామాచారి, శ్రీనివాసాచారి, లక్ష్మయ్య చారి, విశ్వప్రసాద్, విష్ణు ప్రసాద్, పరిపూర్ణాచారి, సత్యనారాయణ చారి తదితరులు పాల్గొన్నారు