తొమ్మిదిన్నర ఏళ్ల లో చేసిన అభివృద్ధి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయి : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

తొమ్మిదిన్నర ఏళ్ల లో చేసిన అభివృద్ధి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయి : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
  • తొలి పూజలు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు..

ముద్ర ప్రతినిధి భువనగిరి :ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, భువనగిరి నియోజక వర్గంలో తొమ్మిదిన్నర ఏళ్ల లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్ళీ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని భువనగిరి ఎమ్మెల్యే, భువనగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం భువనగిరి పట్టణం 12వ వార్డ్  పగిడిపల్లి లోని శ్రీ సీతారంజనేయ దేవాలయం లో తొలి పూజలు నాయకులు, కార్యకర్తలతో పాటు కుటుంబ సమేతంగా కలిసి నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాలలో భువనగిరి నియోజకవర్గం లో నేను చేసిన అనేక అభివృద్ధి పనులు,  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలే భువనగిరి లో నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారు అని అన్నారు. వార్డులో సతీసమేతంగా ఇంటింటికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టో కరపత్రాన్ని అందిస్తూ ఓటును అభ్యర్ధించారు. ప్రజలు శేఖర్ రెడ్డి దంపతులకు మంగళ హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి పైళ్ల వనిత రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు  చిక్కా ప్రభాకర్ గౌడ్, జంగయ్య గౌడ్, వార్డ్ కౌన్సిలర్  లక్ష్మీ సతీష్ యాదవ్, బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 నాన్నను మళ్ళీ ఆశీర్వదించండి : ఎమ్మెల్యే కూతురు పైళ్ల  మన్విత రెడ్డి

భువనగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా  నాన్నను మళ్ళీ గెలిపించండి అని భువనగిరి ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి కూతురు పైళ్ల మన్విత రెడ్డి ఓటర్లను కోరారు. గురువారం పట్టణంలోని అర్బన్ కాలనీలో  బిఆర్ఎస్ నాయకులతో  కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్  కిష్టయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు రాజు, నాగారం సూరజ్, ఇండ్ల శ్రీను పాల్గొన్నారు.