మతిభ్రమించి మాట్లాడుతున్న సుంకే రవిశంకర్

మతిభ్రమించి మాట్లాడుతున్న సుంకే రవిశంకర్
  • పరువు నష్టం దావా వేస్తాం జాగ్రత్త
  •  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ళపు రమేష్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పై, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేసిన వాఖ్యలను మాజీ డిప్యూటీ మేయర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ళపు రమేష్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రమేష్ మాట్లాడుతూ చొప్పదండిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రవిశంకర్ కు, ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన బుద్ధి వచ్చినట్టు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు అవినీతి సామ్రాట్ అయినటువంటి రవిశంకర్ గడచిన ఐదు సంవత్సరాల కాలంలో చొప్పదండి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యపు నీడన వదిలేసి తాను ఓడిపోయి ప్రజలు తిరస్కరిస్తే కరీంనగర్ లో వచ్చి తమ నాయకుడి పై అవాకులు చివాకులు పేల్చడం సిగ్గు చేయడానికి విమర్శించారు. నీ నాయకుడు కేటీఆర్ అమెరికాలో హోటల్లో పని చేసి, ప్యారాచూట్ వలే ఉద్యమం చాటున ఎమ్మెల్యే కావచ్చని స్వార్థంతో వచ్చి ఇంకొకరిది గుంజుకొని ఎమ్మెల్యే అయిన నీచ చరిత్ర కలిగిన వ్యక్తి అని రవిశంకర్ గుర్తు ఎరుగాలని అన్నారు.

బిసి బిడ్డగా అంచెలంచెలుగా ఎదిగిన బండి సంజయ్, కేసిఆర్ కుంటుబ రాచరికపు మోసపూరిత పాలన పై పోరాటం చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పారు.  మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఘాటుగా విమర్శించారు. దేశం కోసం ధర్మం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్న బండి సంజయ్ కి తక్షణమే బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ వినోద్ కుమార్ రవిశంకర్ లు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని లేకపోతే  కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని బిజెపి కార్యకర్తలు గట్టి గుణపాఠం చెబుతారన్నారు. కేటీఆర్ బుడ్రకాన్, కేసీఆర్ పిట్టలదొర అని ప్రజలందరికి తెలుసని రమేశ్  ఎద్దేవా చేశారు.అధికారం కోల్పోవడంతో తట్టుకోలేక, బీఆర్ఎస్ నాయకులు, ప్రధాని మోదీ పాలనను చూసి ఓర్వలేక, ఓ వైపు కేటీఆర్, మరోవైపు వినోద్ కుమార్, ఓడినా ఎమ్మెల్యేలు ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే బిజెపి కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.