కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వాయర్ రానివ్వను

కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వాయర్ రానివ్వను
  • లిఫ్ట్ తో సాగునీరు అందిస్తా
  • టిఆర్ఎస్ అభ్యర్థి కడియం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్:  నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వాయర్ రాదు, రానివ్వను లిఫ్ట్ తో ఆరు నెలల్లో సాగునీరు అందిస్తానని టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి, లింగంపల్లి, కొండాపూర్, మల్కాపూర్, వెంకటాద్రి పేట, తీగల తండా, రాజవరం గ్రామాల్లో బుధవారం గ్రామస్థాయి ఆత్మీయ సమావేశాలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో ఇండ్లు, వ్యవసాయ భూములు నీట మునిగి జీవనాధారం కోల్పోతూన్నాం అన్న ఆ రిజర్వాయర్ రద్దు చేయించినట్లు శ్రీహరి తెలిపారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఆ రిజర్వాయర్ రాదు, రానివ్వను అన్నారు. శ్రీపతి పల్లి, లింగంపల్లి, కొండాపూర్, మద్దెలగూడెం, పిసర తదితర గ్రామాల్లోని సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.104 కోట్ల వ్యయంతో లిఫ్ట్ ఏర్పాటుచేసి ఆరు నెలలు అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తానన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు టిఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలులో ఆదర్శంగా నిలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరో మారు ఆశీర్వదించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఎంపీపీ సరిత బాలరాజు, సర్పంచులు ప్రత్యూష రెడ్డి, రవీందర్, ఎల్లమ్మ, రవి, రఘుపతి, తిరుమల శ్యాం కుమార్ రెడ్డి, లలితా దేవి కృష్ణమోహన్ రెడ్డి, నాయకులు మామిడాల లింగారెడ్డి, సమ్మయ్య, మాచర్ల ప్రవీణ్, షకీల్, గజ్జల దామోదర్, సంపత్ రెడ్డి, మనోజ్ రెడ్డి, భూక్య రమేష్, పోలపల్లి రంజిత్ రెడ్డి, ఎడవెల్లి మాధవరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు