ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరం

ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరం

టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పిచ్చెట్టి చంద్రశేఖర్ రావు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అందరికీ అవసరమని  విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందిపుచ్చు కునేందుకు దోహదం చేస్తుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పిచ్చెట్టి చంద్రశేఖర్ రావు అన్నారు. జనగామ జిల్లా  స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని శివునిపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ జనగామ జిల్లా శాఖ మరియు ఫూలే అధ్యయన వేదిక  సంయుక్తంగా నిర్వహించిన ఏడు రోజుల  స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల ముగింపు సమావేశానికి టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ వారం రోజుల పాటు నిర్వహించిన ఈ తరగతులలో ప్రతి రోజు 50 మంది హాజరై  సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు విద్యార్థుల కు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శి చిక్కుడు శ్రీనివాస్, జిల్లా అకడమిక్ సెల్ కన్వీనర్ తోట వెంకటేశ్వర్లు, కోర్సు డైరెక్టర్లు గుండె కనకయ్య, ఆవుల అమర్ నాథ్, పిచ్చెట్టి త్రివిక్రమ్ రావు, రషీద్, ఆవుల అమర్ నాథ్, బేతి శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నీలకంఠం, గుగులోత్ ఫకీర్ దాస్, యాతం రమేష్, అయిత కృష్ణమోహన్, గొడుగు గోపాలకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.