రాజయ్యకు బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు

రాజయ్యకు బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు

ముద్ర, తెలంగాణవార్తలు: మొన్నటిదాకా బీఆర్ఎస్ లో కొనసాగిన కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరడంతో, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ బాధ్యతలను తాటికొండ రాజయ్యకు అప్పగిస్తూ మాజీముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా రాజయ్య వెళ్లి కలిశారు. ఈసందర్భంగా కేసీఆర్ ఆయనకు స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగించడంతో పాటు, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కుమార్ ను గెలిపించాలని కోరారు.