మోడీని గద్దె దించితేనే దేశానికి రక్ష

మోడీని గద్దె దించితేనే దేశానికి రక్ష
  • తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ

భూదాన్ పోచంపల్లి,ముద్ర:-కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని, మోడీని గద్దె దించితేనే దేశానికి రక్షణ అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని చౌటుప్పల్ చౌరస్తాలో రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్, సమ్మెలో భాగంగా సిఐటియు,  ఏఐటియుసి, ఐ ఎన్ టి యు సి ,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని అన్నారు. అదేవిధంగా మూడు నెలలుగా గ్రామపంచాయతీ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పగిళ్ళ లింగారెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ప్రసాదం విష్ణు, సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, ఐ ఎన్ టి యు సి బ్లాక్ అధ్యక్షులు కుక్క దానయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డేపల్లి యాదగిరి, నాయకులు చేరాల పెద్ద నరసింహ, జంగమ్మ, వసంత, పారిజాత, కవిత, బాలయ్య, వెంకటేష్, సత్తయ్య, గట్టు వెంకటేష్,నరసింహ, బాలరాజు, చాంద్ పాషా, బాబు, కుక్క నరేష్, కొండమడుగు సత్తయ్య, నరసింహ, బసవయ్య, జంగయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.