సామాజిక సారథి విలేకరి ప్రకాష్ నుండి రక్షణ కల్పించాలి...బాధితుల గోడు కన్నీటి పర్వతం

సామాజిక సారథి విలేకరి ప్రకాష్ నుండి రక్షణ కల్పించాలి...బాధితుల గోడు కన్నీటి పర్వతం
  • పేపర్ను అడ్డం పెట్టుకుని అడ్డగోలు వసూలు
  • కాంగ్రెస్ ప్రజా ప్రతినిధి పేరు చెప్పుకొని దందాలు

ముద్ర ప్రతినిధి హైదరాబాద్  :  సామాజిక సారధి పత్రిక పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్న గంగు ప్రకాష్ నుండి రక్షణ కల్పించాలని పాలెం తాజా మాజీ సర్పంచ్ భర్త గోవిందు నాగరాజు అక్రమ్ స్టార్ రాజు కిమ్యా తాండ మాజీ సర్పంచ్ ఆంగోతు మంజుల పాలెం గ్రామానికి చెందిన బాగరి మంజులలు కోరారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్లాట్లు ఇప్పిస్తానంటూ సంక్షేమ పథకాలను మంజూరు చేయిస్తానంటూ చిట్టీల పేరుతో అనేక మందిని మోసం చేసిన గంగు ప్రకాష్ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రశ్నించిన వారిపై కులం పేరుతో కేసులు నమోదు చేస్తామని బెదిరించడం వల్ల బాధితులు ముందుకు రావడంలేదని గ్రామంలో కొంతమందిని పోగేసుకుని రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు.

గోవింద నాగరాజు మాట్లాడుతూ ఒక హత్య కేసులో తమను ముద్దాయిగా వార్తలు రాయడం వాటిని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంగు ప్రకాష్ బాధితులు ప్రతి గ్రామంలో ఉన్నారని తమకు జరిగిన అన్యాయంపై ఇటీవల జిల్లా పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఆయన తండ్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గతంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ ధ్రువీకరణ పత్రం పొంది రేషన్ షాపును దక్కించుకున్నారని వీటి పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధం లేని విషయాలలో ఇతరులను చేర్చుతూ బెదిరింపులకు దిగడం ఆయన నైజం అని ఇలాంటి వారి నుండి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు మరో బాధితురాలు కిమ్య తాండ తాజా మాజీ సర్పంచ్ ఆంగోతు మంజుల మాట్లాడుతూ తన భర్త కృష్ణ నాయక్ మృతికి గంగు ప్రకాష్ వేధింపులే కారణమని పేర్కొన్నారు ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పది లక్షలు డిమాండ్ చేయగా ఇవ్వకపోవడం వల్లే తన ఇంటిని కూల్చి వేయించారని మండిపడ్డారు మరో బాధితురాలు మంజుల మాట్లాడుతూ తనకు ప్లాట్ ఇప్పిస్తానని నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారని ఇంతవరకు ప్లాట్ ఇవ్వకపోవడం తాను డబ్బులు అడుగుతే తనకు రాజకీయ పార్టీ అండదండ ఉందని పోలీసులు సపోర్టు ఉందని అడుగుతే వ్యభిచారం కేసు నమోదు చేయిస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్వతమయ్యారు ఈ సమావేశంలో స్టార్ రాజు అక్రమ్ తదితరులు తమ ఆవేదనను వినిపించారు