ప్రైవేట్ పాఠశాలల మండల అధ్యక్షునిగా ఉప్పలయ్య

ప్రైవేట్ పాఠశాలల మండల అధ్యక్షునిగా ఉప్పలయ్య

రామకృష్ణాపూర్,ముద్ర: మందమర్రి మండలం ప్రైవేట్ పాఠశాలల మండల కమిటీని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర్ల సిద్దయ్య అధ్యక్షతన నిర్వహించినట్లుగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు పెద్దపల్లి ఉప్పలయ్య సోమవారం తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల మండల అధ్యక్షునిగా పెద్దపల్లి ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి ఎర్రం కరుణాకర్ రెడ్డి, ట్రెజరర్ రామగిరి కృష్ణమోహన్, గౌరవ అధ్యక్షుడు పోలు శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్,జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ అభినందించారు.