అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం

అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం

డిపిఓ, ఎంపీడీవో జీతాలు ఆపాలని డిమాండ్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: శివుని పల్లి గ్రామపంచాయతీలో జరిగిన అవినీతి డబ్బు రికవరీ ఎప్పుడు చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఆ డబ్బులు రికవరీ చేసే వరకు డిపిఓ, ఎంపీడీవో, ఎంపిఓ జీతాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. జనగామ స్టేషన్ ఘన్ పూర్ మండలం శివుని పల్లి గ్రామ సభ శనివారం ఏకైక వార్డు సభ్యులు బూర్ల విష్ణు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో అధికారుల విఫలమయ్యారని ప్రజలు ధ్వజమెత్తారు. పూర్తిస్థాయి పాలకమండలి లేకపోవడం, ఇన్చార్జి ఎంపీడీవో వలన ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గ్రామానికి రావలసిన నిధులు సక్రమంగా రావడం లేదని రోడ్డు వెడల్పులో వేసిన విద్యుత్ స్తంభాలకు డబ్బులు కట్టామని ఇంకా దాదాపు 30 విద్యుత్ స్తంభాల అవసరం ఉండగా డబ్బులు కట్టమని అడగడం ఎంతవరకు సమంజసం అన్నారు. స్మశాన వాటికలో సిసి రోడ్లు, ఫెన్సింగ్ పనులు పూర్తి కాలేదు అన్నారు.  

చేస్తామని చెప్పారు తప్ప ఇప్పటివరకు చేయలేదని. తోట లక్ష్మి నారాయణ, తోట రమేష్ మాట్లాడుతూ మార్కెట్ నుండి, ఓ ఎఫ్ సి కేబుల్ పనులు జరిగినప్పుడు వచ్చిన నిధులను అప్పటి అధికారులు స్వాహా చేశారు. వాటిని రికవరీ చేయాల్సిన అవసరం ఉందని అప్పటివరకు సంబంధిత అధికారుల వేతనాలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీటీసీ రాజు, ఎంపీ ఓ సుధీర్, కార్యదర్శి శ్రీకాంత్ లతోపాటు గ్రామస్తులు చిగురు విజయ్, మాజీ సర్పంచ్ దేవయ్య, సుధాకర్, వ్యాపారస్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.