రాష్ట్ర సంపాద... పందికొక్కుల మెక్కుతున్నారు ... సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

రాష్ట్ర సంపాద... పందికొక్కుల మెక్కుతున్నారు ... సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: రాష్ట్ర సంపదను కెసిఆర్ కుటుంబం పందికొక్కుల మెక్కుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భజమెత్తారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలంలో కొమ్ము గుట్ట, లింగంపల్లి మీదుగా తరిగొప్పుల మండలంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా లింగంపల్లి రచ్చబండ లో భట్టి మాట్లాడుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర సంపాదను కెసిఆర్ కుటుంబం పందికొక్కు లాగా దోపిడీ చేస్తుంది అన్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు. అమరుల ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చుకుంటే, కెసిఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. అమ్మ హస్తం పేరుతో 9 రకాల నిత్యావసర సరుకులు రేషన్ షాపుల్లో అందిస్తాం, కూలీలందరికీ కూలి బంద్ పథకంతో ఏడాదికి 12 వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తాం, వడ్డీ లేని రుణాలు ద్వారా మహిళల సాధికారతకు పాటుపడతాం అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చేవరకు, నిరుద్యోగ భృతి ఇస్తాం, పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచుతామని అన్నారు.

తెలంగాణ సంపద ప్రజలకు చేరకుండా ఆరోజు ఆంధ్ర నాయకులు అడ్డుకుంటే, ఇప్పుడు కేసీఆర్ కుటుంబం దోచుకుని దోచుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమం కోసం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ పాదయాత్రలో సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య, గంగారపు అమృత రావు, వినోద్, చిరంజీవి  మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సురేష్ కుమార్, జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, నాయకులు దిలీప్ రెడ్డి, కొలిపాక సతీష్, లింగోజి, సింగపురం వెంకటయ్య, వసంత్, మార్క్ శ్రీనివాస్, కూరుకుప్పల మహేందర్, చింత ఎల్లయ్య, కండ్లకోలు బాలరాజు, గాజుల రజిత, గ్రామం శాఖ అధ్యక్షుడు రమేష్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.