లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జనగామ అధ్యక్షుడిగా మాజీ కల్నల్‌ ‘మాచర్ల’

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జనగామ అధ్యక్షుడిగా మాజీ కల్నల్‌ ‘మాచర్ల’

ముద్ర ప్రతినిధి, జనగామ: లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ 49 వ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక సాయిరాం కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. క్లబ్‌ నూతన అధ్యక్షుడిగా మాజీ కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, కార్యదర్శిగా కాసల సంతోష్ కుమార్, కోశాధికారిగా మాశెట్టి సంతోష్‌తో పాటు కార్యవర్గ సభ్యులతో ఉప జిల్లా గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య, రీజియన్ చైర్మన్ రాపాక విజయ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి క్లబ్‌ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ సేవలు చాలా గొప్పవి ఉన్నతమైన క్లబ్‌ను కొనియాడారు. కల్నల్‌ భిక్షపతి సైనికుడిగా దేశానికి ఎంతో సేవలు చేశారని, ఇప్పుడు మళ్లీ ఇక్కడ సేవ చేయడం ఆయనకు కొత్త ఏమి కాదన్నారు. కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్ కాసం అంజయ్య, జిల్లా జీఎస్‌టీ కో ఆర్డినేటర్ వి.ప్రసాద్ రావు, రీజియన్ చైర్మన్ రాపాక విజయ్, రాజశేఖర్ రెడ్డి, జోన్ చైర్మన్ జైన రమేశ్‌, పజ్జురి గోపయ్య, జయహరి, డాక్టర్‌‌ సి.హెచ్‌ రాజమౌళి, కృష్ణారెడ్డి, మోహన్‌రెడ్డి, ప్రమోద్, బజాజ్, మార్యాల అశోక్, అల్లాడి ఈశ్వర్‌‌రావు పాల్గొన్నారు.