ముత్తిరెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి

ముత్తిరెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి

 కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే నా లక్ష్యం..

 భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆదివారం జనగామ పట్టణంలోని కొమ్మూరి ప్రతాపరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో మాట్లాడుతూ నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న అని, వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలంతా మొక్కవోని ధైర్యంతో సైనికుల్లా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల మీద కపట ప్రేమ చూపిస్తూ మోసపు వాగ్దానాలతో మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడు.ప్రజలంతా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని శంకరగిరి మాన్యాలకు పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.జనగామ చేర్యాల ప్రాంతం చారిత్రాత్మక చరిత్ర కలిగిన బైరాన్ పల్లిలో ఒక దౌర్భాగ్యపు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉండడం అత్యంత బాధాకరమైన విషయం ఆయన సొంత కూతురే ఆయన కబ్జాకోర్ అన్ని అనివిషయాలను బయటపెట్టిందంటే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.రాష్ట్రంలో జనగామలో భారీ మెజార్టీతో గెలిచే సీట్ కాంగ్రెస్ పార్టీ అని మా సర్వేల్లో తేలిందని అన్నారు. జనగామలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే మన అందరి లక్ష్యమని అన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు.

ముత్తిరెడ్డి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగడాలు ఈ ఎన్నికల్లో చెల్లవని ఓటు ద్వారా ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పిసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను ఘోరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ధన దాహానికి ఈ రోజు అప్పుల పాలైందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్, జనగామ జిల్లా నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చారబూడ్ల దయాకర్ రెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర మాజీ కార్యదర్శి జనగామ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు సుంకరి శ్రీనివాస్ రెడ్డి , డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షలు బనుక శివరాజ్ ,యాదవ్ కిసాన్ కాంగ్రెస్ జనగామ పట్టణ అధ్యక్షులు మోటే శ్రీనివాస్ ,జనగామ మండల సీనియర్ లింగాల నర్సిరెడ్డి, జనగామ జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి ఆలేటి సిద్ధిరాములు, బోట్ల నర్సింగరావు, బచ్చనపేట ఎంపీటీసీ నల్లగొని బాలకిషన్ గౌడ్ , 9వవార్డు కౌన్సిలర్ ముస్త్యాల చందర్, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్ తదితరులు పాల్గొన్నారు