అన్ని కమర్షియల్ అంశాలున్న  "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" ... నిర్మాత యష్ రంగినేని

అన్ని కమర్షియల్ అంశాలున్న  "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" ... నిర్మాత యష్ రంగినేని

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన సినిమా "అన్నపూర్ణ ఫోటో స్టూడియో". మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు.  "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలియజేశారు నిర్మాత యష్ రంగినేని. వర్ధన్ దేవరకొండ గారి ద్వారా నాకు చెందు పరిచయం. చెందు దగ్గర మంచి కథ ఉంది వినమని ఆయనే చెప్పారు. చెందు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మూడేండ్ల కిందట ఇదంతా జరిగింది. చెందు చెప్పిన కథలోని పల్లెటూరి నేపథ్యం, టర్న్ లు, ట్విస్ట్ లు నచ్చాయి. నాకు పాత తెలుగు సినిమాలు ఇష్టం. లండన్ వెళ్లినప్పుడు ఎన్టీఆర్ పాత సినిమాలు చూస్తుంటాను. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ అంటే ఇలా ఉండాలని అనిపిస్తుంటుంది. చెందు చెప్పిన కథలోని పీరియాడిక్ నేపథ్యం, కోనసీమ పల్లెటూరి బ్యాక్ డ్రాప్  ఆకట్టుకుంది. మనం ఈ సినిమా చేస్తున్నాం అని అతనితో చెప్పాను. 2022 ఆగస్టులో సినిమా షూటింగ్ ప్రారంభించాం.- పల్లెటూరిలో జరిగే ప్రేమ కథ ఇది. కొన్ని కారణాల వల్ల హీరో పెళ్లి చేసుకోవడం ఆలస్యమవుతుంది. ఇంతలో ఒక అనూహ్య ఘటన జరుగుతుంది. ఆ ఘటన వల్ల వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది థ్రిల్లింగ్  ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. జెన్యూన్ గా ఈ సినిమాను నిర్మించాం. సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకోలేదు. అయితే పూర్తి కమర్షియల్ అంశాలుంటాయి. అవి కథలోని కుదిరాయి.