అభివృద్ధిలో బాన్సువాడ నెంబర్ వన్

అభివృద్ధిలో బాన్సువాడ నెంబర్ వన్
  • నాన్ లోకల్స్ తో ఒరిగేదేమీ లేదు                                                           
  • బాన్సువాడ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పోచారం                               
  • డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి                                          

బాన్సువాడ, ముద్ర: బాన్సువాడ లో వేల కోట్లతోఅభివృద్ధి జరిగిందని,  రాష్ట్రంలోనే నంబర్ వన్ అని  బిఆరెస్ రాష్ట్ర నాయకుడు, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆరోపించారు.  భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా బాన్సువాడ  మండలం ఇబ్రహీంపేట్ లో స్థానిక ప్రజాప్రతినిదులు, నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన పోచారం శ్రీనన్నపై పోటీ చేయడానికి నిజామాబాద్ నుండి బిజెపి అభ్యర్థి, ఎల్లారెడ్డి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చారని అన్నారు. మంచి పనులు చేయట్లేదనే గత ఎన్నికలలో అక్కడి ప్రజలు వాళ్ళను ఓడించారని అన్నారు. స్వంత నియోజకవర్గంలో సేవ చేయని నాయకులు ఇక్కడకు వచ్చి మాత్రం చేస్తారా అని, ఎల్లారెడ్డి లో చెల్లని రూపాయి బాన్సువాడ లో చెల్లుతుందా ?

ప్రజలు ఆలోచించాలని అన్నారు. మా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఆలోచనాపరులని, ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనేది ఆలోచన చేయగలరని అన్నారు. ఎక్కడి నుంచో వచ్చి పగటి వేషాలు వేసే వారికి నియోజకవర్గంలో ఏమి తెలియదని, స్థానికుల కష్టాలు, అవసరాలు వాళ్ళకు అవసరం లేదని,కాంగ్రెస్ అభ్యర్ధి ఏనుగు రవీందర్ రెడ్డి గతంలో ఎల్లారెడ్డి MLA ఉన్నప్పుడు ఏమి పని చేయలేదని, అందుకే  ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు.

2018 ఎన్నికలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  TRS తరుపున ఓడిన ఏకైక వ్యక్తి ఏనుగు రవీందర్ రెడ్డి అని, మంచి పనులు చేయలేదనే ప్రజలు ఓడించారని అన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇల్లు ఒక్కటి కూడా కట్టించలేదని, గ్రామాలలో ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. పైగా పనుల గురించి ఎవ్వరైనా అడిగితే వాళ్ళపై కేసులు పెట్టి హింసించిన వ్యక్తి అని ఆరోపించారు. ఇప్పుడు బాన్సువాడ కు వచ్చింది  ఇక్కడ కూడా భూములు ఆక్రమించడానికి, డబ్బులు సంపాదించడానికి, ఆస్థులు పెంచుకోవడానికి వచ్చాడని అన్నారు.కానీ బాన్సువాడ ప్రజలు అమాయకులు కాదు, నిన్ను బండకేసి కొడతారని అన్నారు.

బాన్సువాడ నియోజకవర్గ బిజెపి, కాంగ్రెస్ నాయకులు‌, కార్యకర్తలు ఆలోచించండని,. నేను ఇక్కడి వాడిని, మీతో పాటు స్థానికుడిని ఇక్కడే పుట్టిన, ఇక్కడే పెరిగిన, చస్తే నా కట్టే కూడా ఇక్కడే కాలుతుందని అన్నారు.కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థులు, ఎన్నికలు అయిపోగానే వెళ్ళిపోతారని,స్థానికుడు అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డిను ఆదరించంచాలని కోరారు.

నవంబర్ 30 న జరిగే పోలింగ్ లో అందరూ కారు గుర్తుపై ఓటు వేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల  పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్,BRS పార్టీ మండల కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, ఇబ్రహీంపేట్ గ్రామ BRS పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,   ఇబ్రహీంపేట్ గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి, బాన్సువాడ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ, మండల నాయకులు గోపాల్ రెడ్డి, గురు వినయ్,  ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.