ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...
  • జిల్లా కలెక్టర్ ... ఎస్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కోరారు.భారీ వర్షాలకు తోడు చలిగాలులు వీస్తున్నందున ప్రజల అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. మట్టి గోడలు, కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నందున చెట్ల కింద కూడా ఉండరాదని రైతులు,  పొలం పనులకు వెళ్ళరాదని సూచించారు.తక్షణ సమాచారం కొరకు కలెక్టర్ కార్యాలయంలో  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు అత్యవసర సమయాల్లో తగు సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ నెంబర్  6281492368 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు.