అకాల వర్షంతో నేల వాలిన పంటలు

అకాల వర్షంతో నేల వాలిన పంటలు
  • ముధోల్ సెగ్మెంట్ లో భారీ నష్టం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కుబీర్, తానూరు మండలాల్లో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు భారీ నష్టం మిగిల్చాయి. ముధోల్ నియోజకవర్గంలోని ఈ రెండు మండలాల్లో భారీ నష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. రబీ పంటలు మొక్క జొన్న, శనగ, కంది పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. కొన్ని చోట్ల కోతలు పూర్తై కుప్ప వేసినవి కూడా తడిచి ముద్దయ్యాయి. మసల్గా తదితర గ్రామాల్లో పుచ్చకాయ పంట పండిస్తారు. ఈ వర్షాలతో పంట పూర్తిగా దెబ్బ తిన్నది.