ఎమ్మెల్సీ కవితకు నవంబర్ 20వరకు నోటీసులు ఇవ్వొద్దు : సుప్రీం కోర్టు

ఎమ్మెల్సీ కవితకు నవంబర్ 20వరకు నోటీసులు ఇవ్వొద్దు : సుప్రీం కోర్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈడీ ఆఫీసుకు తనను పిలిచి విచారించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. నవంబర్ 20వరకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వొద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 20 వరకు ఆమెకు సమన్లు ఇవ్వబోమని కోర్టుకు ఈడీ తెలిపింది. మహిళ అయినంత మాత్రాన్న విచారణ వద్దనలేమని, అయితే మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో మంగళవారం ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ జరిగింది. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించడాన్ని సవాల్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ఆ కేసు పెండింగ్‌లో ఉండగానే ఇటీవల ఈడీ మరోసారి కవితకు నోటీసులిచ్చింది. దీంతో మళ్లీ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు.