ఘనంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

ఘనంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

ముద్ర, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు గురువారం ఘనంగా ముగిశాయి. దశాబ్ది ఉత్సవాల చివరి రోజును పురస్కరించుకుని రాంనగర్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి ఎమ్మెల్యే ముఠాగోపాల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. బైకు ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ అమరవీరుల స్మారక భవన ప్రారంభోత్సవ సభకు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లారు. అంతకుముందు రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో సమిష్టి పోరాటాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు.

తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటి పైకి తీసుకు రావడంతో పాటు వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు సమస్య పరిష్కరించి 24 గంటల పాటు నిర్విరామంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ తో పాటు ఇతర సంఘాల నేతల పోరాట పటిమ మరువలేనిదన్నారు. తెలంగాణ సమాజం ప్రభుత్వం ఉద్యమకారుల పోరాట నిరతిని అసువులు బాసిన ఉద్యమకారుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ పవన్ కుమార్, డివిజన్ల బిఆర్ఎస్ అధ్యక్షులు రావులపాటి మోజస్, వై శ్రీనివాసరావు, ముడారపు రాకేష్ కుమార్ (ఎం ఆర్ కె), వల్లాల శ్యామ్ యాదవ్, నర్సింగ్ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శులు దామోదర్ రెడ్డి, చాంద్ పాషా, పోతుల శ్రీకాంత్, సాయి కృష్ణ, ఆకుల అరుణ్ కుమార్, నాయకులు ముఠా జైసింహ, శ్రీధర్ రెడ్డి, సురేందర్, మరియు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.