2న తెలంగాణ కు మీరాకుమార్ రాక

2న తెలంగాణ కు మీరాకుమార్ రాక
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మీరా కుమార్.
  • టీపీసీసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీపీసీసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఘనంగా నిర్వహించనున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన అప్పటి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొననున్నారని ఈ సందర్భంగా గాంధీ భవన్ లో జరిగే సమావేశంలో ఆమె ప్రసంగిస్తారని అన్నారు. అనంతరం మీరా కుమార్ కు టీపీసీసీ తరపున పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఉంటుందని కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొననాలని ఆయన పిలిపునిచ్చారు.