ఓటరు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు : ఈసీ

ఓటరు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు : ఈసీ

ముద్ర,సెంట్రల్ డెస్క్:- అర్హుడైన ఏ ఒక్క భారతదేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్‌ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు కార్డులో అచ్చు తప్పులు, క్లరికల్‌ దోషాలు ఉన్నా వాటిని విస్మరించి ఓటు వేసే హక్కును కల్పించాలని ఆదేశించింది.

ఒక వేళ ఓటరు కార్డులోని ఫొటో సరిపోలకపోతే ఓటరు మరో ప్రత్యామ్నాయ ఫొటో డాక్యుమెంట్‌ను ఆధారంగా చూపి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది. అలాగే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు ఐడీ కార్డును లేని వారు, లేదా తీసుకురాని వారు ప్రత్యామ్నాయ ఫొటో ఐడెంటిటీ పత్రాన్ని తమ గుర్తింపుగా చూపి ఓటు వేయొచ్చునని ఈసీ స్పష్టం చేసింది.