ఐదురోజుల లాభాలకు బ్రేక్‌ - నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌

ఐదురోజుల లాభాలకు బ్రేక్‌ - నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌

ముంబై :  భారత స్టాక్‌ మార్కెట్లలో ఐదు రోజుల రికార్డు లాభాలకు బ్రేక్‌ పడింది.  మొన్నటివరకు  రికార్డు స్థాయిలో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న బెంచ్‌ మార్క్‌ సూచీలు చేరుకున్నాయి. బుధవారం సెన్సెక్స్‌ స్వల్పంగా నష్టపోగా.. నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది.   టేడ్రింగ్‌లో సెన్సెక్స్‌ 33.01 పాయింట్లు పతనమై.. 65,446.04 పాయింట్ల వద్ద ముగిసింది.  మరోవైపు, నిఫ్టీ కేవలం 9.50 పాయింట్ల స్వల్ప లాభంతో 19,398.50 పాయింట్ల వద్ద స్థిరపడింది.  మరోవైపు ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా షేర్లలో మంచి కొనుగోళ్లు కనిపించాయి. మంగళవారం అంతకుముందు ఇది ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిన విషయం తెలిసిందే.   ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాల నేపథ్యంలో బుధవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  అయితే బీఎస్‌ఈలో జాబితా చేసిన అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) తొలిసారిగా రూ.300లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.  బజాజ్‌ ఆటో, దివిస్‌ ల్యాబ్‌,  హీరోమోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మారుతి సుజుకీ టాప్‌ గెయినర్స్‌గా నిలువగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐచర్‌ మోటార్స్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, యూపీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.