మ‌స్క్ నిర్ణయం  క‌రెక్టే 

మ‌స్క్ నిర్ణయం  క‌రెక్టే 
  • ట్విట్టర్​ బ‌లోపేతానికేన‌న్న  సీఈఓ 

వాషింగ్టన్​ :  ట్విట్టర్​  అధినేత ఎల‌న్‌మ‌స్క్ తీసుకున్న నిర్ణయాన్ని  ఆ సంస్థ సీఈఓ లిండా య‌కారినో స‌మ‌ర్థించారు.  యూజ‌ర్లు ట్వీట్లను వీక్షించ‌డానికి ప‌రిమితి విధిస్తూ ఎల‌న్‌మ‌స్క్ నిర్ణయించారు. ట్విట్టర్​ను బ‌లోపేతం చేయ‌డానికి మ‌స్క్ నిర్ణయం  చేయూత‌నిస్తుంద‌ని  ట్వీట్ చేశారు. ఎల‌న్‌మ‌స్క్ నిర్ణయంపై తీవ్ర విమ‌ర్శలు  వెల్లువెత్తుతున్న  నేప‌థ్యంలో సీఈఓ లిండా య‌కారినో ఈ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. 
ట్విట్టర్లో  ఫేక్ ఖాతాల‌ను నియంత్రించ‌డానికే ఎల‌న్‌మ‌స్క్ ఈ నిర్ణయం  తీసుకున్నార‌ని లిండా య‌కారినో చెప్పుకొచ్చారు. తాజా నిర్ణయం వల్ల  సాధార‌ణ ట్విట్టర్​  యూజ‌ర్లపై  ప్రభావం  చూప‌ద‌ని అభిప్రాయ ప‌డ్డారు. ట్వీట్ల వీక్షణకు ప‌రిమితులు విధిస్తూ ఎల‌న్‌మ‌స్క్ నిర్ణయం తీసుకున్న మూడు రోజుల‌కు సీఈఓ లిండా య‌కారినో ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.  గత శ‌నివారం రాత్రి నుంచి  ట్విట్టర్​  సేవ‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది.  త‌మ ట్వీట్లు చూడ‌లేక‌పోతున్నామంటూ ప‌లువురు యూజ‌ర్లు ఫిర్యాదులు చేశారు. నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.  దీంతో ట్విట్టర్లో  పోస్టుల వీక్షణకు ప‌రిమితులు విధిస్తున్నామ‌ని ఎల‌న్‌మ‌స్క్ వెల్లడించారు. ఎల‌న్‌మ‌స్క్ నిర్ణయంతో  ట్విట్టర్​  భ‌విత‌వ్యంపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.  ఈ ప‌రిస్థితుల్లో ట్విట్టర్​కు  పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ త్వరలో `థ్రెడ్స్‌` అనే యాప్ తీసుకు రానున్నట్లు  సంకేతాలిచ్చింది.