ప్రజాపాలనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడాలి

ప్రజాపాలనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ఎ. దేవసేన
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీ  దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ఏ. దేవసేన అన్నారు.  గురువారం  చొప్పదండి మండలంలోని ఆర్నకొండ, చాకుంట గ్రామాలతో పాటు కరీంనగర్ మండలం లోని తీగలగుట్టపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారెoటీల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ఎ. దేవసేన పరిశీలించారు.   ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ డిసెంబర్‌ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డులలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని,  ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తు ఫారాలను  ఉచితంగా అందించడం జరుగుతుందని, అదే విధంగా దరఖాస్తు ఫారాలను నమోదు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కోనే వారి కొరకు కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసి దరఖాస్తు ఫారాలను నమోదు చేయాలని సూచించారు.  మిగిలిన వారికి దరఖాస్తు నమోదులో అవసరమైన సలహాలను సూచనలను ఆందించాలని పేర్కోన్నారు.   కార్యక్రమాన్ని మొదలు పెట్టిన నాడు కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోలేని వారి నుండి జనవరి 6వ తేది వరకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  వచ్చిన ప్రతి దరఖాస్తును రికార్డులలో నమోదు చేయాలని సూచించారు.  
ఆర్నకొండ గ్రామంలో సమ్మక్క  తన భర్త మల్లయ్యకు వికలాంగుల పింఛను మంజూరు కొరకు దరఖాస్తును సమర్పించాడినికి రాగా ఆమె దరఖాస్తును స్వయంగా నోడల్ అధికారి దేవసేన పరిశీలించి నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లా కలెక్టర్ ద్వారా సమ్మక్క కు రశీదును ఇప్పించారు.  అనంతరం  కేంద్రాలకు వచ్చి ప్రజలకు కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరిచడంతో పాటు  ప్రజాపాలన కార్యక్రమం గురించి వారిఅభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డి ఆర్ డి ఓ శ్రీలత రెడ్డి, తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.