రైతులకు ర‌క్ష‌ణ క‌వ‌చం ముఖ్య‌మంత్రి కేసీఆర్ - వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ 

రైతులకు ర‌క్ష‌ణ క‌వ‌చం ముఖ్య‌మంత్రి కేసీఆర్ - వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ 

మొగుళ్లపల్లి, ముద్ర: రైతులకు ర‌క్ష‌ణ క‌వ‌చంలా మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిలిచారని చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్  అన్నారు. గురువారం బంగ్లాపల్లి, గుడిపహాడ్, నర్సింగాపూర్ గ్రామాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆయనకు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు శాలువాతో ఘనంగా సత్కారం చేశారు. అనంతరం ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు..ఒక‌ప్పుడు ఎస్సారెస్పీ ఎండిపోయి రైతులు ఆగ‌మ‌య్యేదని తెలిపారు. మ‌నం రివ‌ర్స్ పంపింగ్ చేప‌ట్టిన త‌ర్వాత ఎస్సారెస్పీ నిండుకుండ‌లా మారిందని, స‌ముద్రంలాగా క‌న‌బ‌డుతుందని, ఇది కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మైందన్నారు. సాగునీటి విష‌యంలో క‌ష్టాలు త‌ప్పాయన్నారు.

వ్యవసాయానికి 24 గంట‌ల‌ క‌రెంట్ వ‌స్తుందంటే.. రైతుబంధు తీసుకొని ధైర్యంగా వ్య‌వ‌సాయం చేస్తున్నామంటే అందుకు కేసీఆరే కార‌ణమన్నారు. రైతుబీమాతో రైతుల కుటంబాల‌ను ఆదుకోవడం, అదే విధంగా రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర కేటాయించి కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం మనందరి అదృష్టమని, నేడు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. వారికి అక్కడ అమలు చేసే దమ్ములేదు కాని ఇక్కడ సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలంతా ఆలోచించాలని, పనిచేసే వారికి పట్టం కట్టాలని ఆయన  ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమమే బి.ఆర్.ఎస్. ఎజెండా అని పేర్కొన్నారు. ఎండ్లకేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికలు రాగానే ఎదో చేస్తామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

గ్యారంటీ పథకాలు అని వస్తున్న కాంగ్రెస్ పార్టీకే తెలంగాణలో గ్యారంటీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసిన బిజెపి లేవదు, కాంగ్రెస్ గెలవదన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు, జడ్పిటిసి జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింహారావు, వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు కరాబ్ రజిత- యువరాజు, పాశం స్వరూప- పర్వతాలు, సతీష్, ఆయా గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.