బీఆర్ఎస్ కు మరో షాక్...ఏకంగా బీఆర్ఎస్ ఖండువాను స్పీడ్ పోస్ట్ చేసిన మాజి ఎంపీ

బీఆర్ఎస్ కు మరో షాక్...ఏకంగా బీఆర్ఎస్ ఖండువాను స్పీడ్ పోస్ట్ చేసిన మాజి ఎంపీ

ముద్ర,తెలంగాణ:-బీఆర్ఎస్ కి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కి పంపారు. రాపోలు ఆనంద భాస్కర్ తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నా అని రాపోలు పేర్కొన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో నా లాంటి నేతలు ఉన్నారని తెలిపారు. 2022 లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరా అని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక నా అనుబంధాన్ని తుంచుకుంటున్నానని తెలిపారు. తాను బీఆర్ఎస్ లో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చిన బీఆర్ఎస్ కండువాను హైదరాబాద్ తెలంగాణ భవన్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపానని రాపోలు చెప్పారు.