20 మందితో  బీఎస్పీ తొలి జాబితా

20 మందితో  బీఎస్పీ తొలి జాబితా
  • ప్రకటించిన బీఎస్పీ స్టేట్​చీఫ్​ప్రవీణ్ కుమార్
  • సిర్పూర్ నుంచి బరిలోకి ఆర్.ఎస్ 

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో బీఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బీఎస్పీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే 20 మంది అభ్యర్థులను బీఎస్పీ ప్రకటించడం గమనార్హం. బీఎస్పీ స్టేట్​చీఫ్​ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం జాబితాను ప్రకటించారు. సిర్పూర్ నుంచి బరిలోకి ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగనుండగా.. జహీరాబాద్ నుంచి జంగం గోపి, పెద్దపల్లి నుంచి దాసరి ఉష, దేవరకొండ నుంచి ముడావత్ వెంకటేశ్​చౌహాన్, చొప్పదండి నుంచి కొంకటి శేఖర్, పాలేరు నుంచి అల్లిక వెంకటేశ్వర్ రావు, నకిరేకల్ నుంచి మేడి ప్రియదర్శిని, వైరా నుంచి బానోత్ రాంబాబు నాయక్, ధర్మపురి నుంచి నక్క విజయ్ కుమార్, వనపర్తి నుంచి నాగమోని చెన్న రాములు, మనకొండూరు నుంచి నిషాని రామచందర్, కోదాడ నుంచి పిల్లుట్ల శ్రీనివాస్, నాగర్ కర్నూల్ నుంచి కొత్తపల్లి కుమార్, ఖానాపూర్ నుంచి బాన్సీ లాల్ రాథోడ్, అందోల్ నుంచి ముప్పారపు ప్రకాశ్, సూర్యాపేట నుంచి ఒట్టే జానయ్య యాదవ్, వికారాబాద్ నుంచి గోర్లకాడి క్రాంతి కుమార్, కొత్తగూడెం నుంచి ఎర్ర కామేశ్, జుక్కల్ నుంచి ప్రద్యుమ్న కుమార్ మాధవరావు ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేయనున్నారు.