21న వాసవి నిత్యాన్నదాన సత్రం, వృద్ధాశ్రమం ట్రస్ట్ ప్రారంభం..

21న వాసవి నిత్యాన్నదాన సత్రం, వృద్ధాశ్రమం ట్రస్ట్ ప్రారంభం..

21న వాసవి నిత్యాన్నదాన సత్రం, వృద్ధాశ్రమం ట్రస్ట్ ప్రారంభం..

ప్రారంభించనున్న శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి... ముద్ర ప్రతినిధి భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామ సురేంద్రపురి వద్ద నిర్మించిన వాసవి నిత్యాన్నదాన సత్రం, వృద్ధాశ్రమం ట్రస్ట్ ను ఈ నెల 21న శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు అయిత రాములు, ప్రధాన కార్యదర్శి ఇరుకుల రామకృష్ణ తెలిపారు. గురువారం అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి సమీపంలోని భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ సురేంద్రపురి వద్ద శ్రీ వాసవి నిత్యాన్నదాన సత్రం, వృద్ధాశ్రమం, వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరపనున్నట్లు చెప్పారు.

ప్రారంభమైన వెంటనే నిత్యాన్నదాన సత్రము భక్తులకు అందుబాటులోకి తెస్తామని, యాదాద్రి దైవ క్షేత్రాన్నికీ విచ్చేసే ఆర్యవైశ్యులకి వసతి, నిత్య అన్నదాన సదుపాయం కల్పిస్తామన్నారు. ఈనెల 19 నుంచి గణపతి ప్రార్ధన తో మొదలై 21న ఉదయం కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారి చే జరుపబడుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రాణప్రతిష్ట, నిత్యాన్నదాన సత్రం వృద్ధాశ్రమము, భవన ప్రారంభోత్సవ కార్యక్రమాని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈకార్యక్రమంలో కోశాధికారి చీల విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు మంచాల ప్రభాకర్, ఉపేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.