గీత వృత్తిదారులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది

గీత వృత్తిదారులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది

కోదాడ, ముద్ర:గీత వృత్తిదారులకు ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందని ఎర్రవరం సొసైటీ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు అన్నారు.బుధవారం కోదాడ మండలం ఎర్రవరం లో  గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కంఠమహేశ్వర స్వామి దేవాలయ పనులను  ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణానికి లక్ష రూపాయలు నగదును విరాళంగా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో దేవాలయల నిర్మాణంతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. కంఠమహేశ్వరుని ఆశీస్సులతో గౌడు కులస్తులు సుఖ సంతోషాలతో ఉండాలనీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ అధ్యక్షులు పెండెం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బెల్లంకొండ నాగయ్య,  మాజీ సర్పంచ్ భాషబోయిన  భాస్కరరావు, గౌడ సంఘ నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రావుల వెంకటి, కొండ అంజి, రామారావు, సైదులు, పాల్గొన్నారు.