జడ్పిటిసి రవీందర్ రెడ్డి కి మాతృవియోగం

జడ్పిటిసి రవీందర్ రెడ్డి కి మాతృవియోగం
  • జడ్పిటిసి రవీందర్ రెడ్డి కి మాతృవియోగం
  • మంత్రి ,ఎంపీ, ఎమ్మెల్యే తదితరుల పరామర్శ
  •  రాజమ్మకు పోటాపోటీగా నివాళులర్పించిన నేతలు

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక జెడ్పిటిసి సభ్యులు కడతల రవీందర్ రెడ్డి( బిఆర్ఎస్) మాతృమూర్తి కడతల రాజమ్మ బుధవారం నాడు మరణించారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని రవీందర్ రెడ్డి నివాసం వద్ద ఉంచిన రాజమ్మ మృతదేహానికి కాంగ్రెస్, బిజెపి,బిఆర్ఎస్ పార్టీల నేతలు పోటాపోటీగా నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ రాజమ్మ మరణించిన విషయం తెలియగానే భారతీయ జనతా పార్టీకి చెందిన దుబ్బాక శాసనసభ్యుడు మాధవనేని రఘునందన్ రావు మొదట తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లి రవీందర్ రెడ్డిని పరామర్శించి, అతని తల్లి మృతదేహానికి నివాళులర్పించి వెళ్లారు.

తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన దుబ్బాక నియోజకవర్గం నాయకురాలు కత్తి కార్తీకగౌడ్ తిమ్మాపూర్ గ్రామానికి విచ్చేసి జెడ్పిటిసి రవీందర్ రెడ్డిని పరామర్శించి, రవీందర్ రెడ్డి తల్లి మృతదేహానికి నివాళులర్పించి వెళ్లారు. తరువాత మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి  రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు, భారత రాష్ట్ర సమితి నేతలు పలువురు తిమ్మాపూర్ గ్రామానికి విచ్చేసి రవీందర్ రెడ్డిని పరామర్శించి అతని తల్లి మృతదేహానికి నివాళులర్పించారు రాజమ్మ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈసందర్భంగాఉన్న జడ్పీటీసీ రవీందర్ రెడ్డిని వారు ఓదార్చారు.రాజమ్మ మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరుకున్నారు.అనంతరం రాజమ్మ అంతేక్రియలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి పాల్గొని ఆమె పాడె మోసి రవీందర్ రెడ్డి కుటుంబం పట్ల  తనకున్న అపార ప్రేమనుబంధాన్ని చాటుకున్నారు. అంత్యక్రియలు ముగిసే వరకు ఎంపీ అక్కడే ఉండిఅంతిమ కార్యక్రమంలో పాల్గొన్నారు.