గ్రామ స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

గ్రామ స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూరు మండలం లోని పాటిమట్ల గ్రామంలో పాటిమట్ల యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ స్థాయి క్రీడోత్సవాలు గురువారం ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మి నరసింహ రెడ్డి, సర్పంచి దండెబోయిన మల్లేష్ లు ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రీడలు స్నేహాబావాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తోజు క్రిష్ణ చారి, బండారి ప్రభాకర్,గిరగాని శ్రీనివాస్, రాచకొండ బాలరాజ్,కర్నే వీరేశం,కొక బిక్షం,బండ వెంకట్ రెడ్డి,గుండా రాములు,చిరుమర్తి యాదయ్య,యూత్ తదితరులు పాల్గొన్నారు.