ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేలు ఇవ్వాలి

ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేలు ఇవ్వాలి
  • సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ.

మునుగోడు, ముద్ర :తెలంగాణ రాష్ట్రంలో గత 18 సంవత్సరాలు నుండి గ్రామ ఆరోగ్య కార్యకర్తలుగా అనేక వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు 18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు . ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లు ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగులు పూర్తిచేసి గ్రామాలలో రిజిస్టర్స్ రాయడం సర్వేలు చేయడం ఆన్లైన్ పనిచేయడం బీపీ షుగర్ థైరాయిడ్ తదితర జబ్బులు గుర్తించి ప్రభుత్వం ఇస్తున్న మందులను సప్లై చేస్తూ ప్రజలకు తగిన ఆరోగ్య సూచనలు ఇస్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్న పిల్లలకు  ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇంత పని చేస్తున్న ఆశ వర్కర్లకు వేతనం ఇవ్వకుండా పారితోషికాల పేరుతో పని భారం పెంచి వెట్టిచాకిరి చేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశ వర్కర్స్ కు 18 వేల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ ఈఎస్ఐ, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఏ ఎన్ఎం జిఎన్ఎం పోస్టులో ఆశలకు ప్రమోషన్, ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్స్ కు టీబి లెప్రసీ కంటి వెలుగు కరోనాకాలంలో ఇవ్వవలసిన రిస్క అలవెన్స్ ల  పెండింగ్ బిల్లులను ఇవ్వాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య , చండూరు మండల కన్వీనర్ జేరిపోతుల ధనంజయ, సిఐటియు మండల నాయకులు యాసరాని వీరయ్య,ఆశ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు రమావత్ కవిత, జిల్లా నాయకురాలు జంపాల వసంత, ఏర్పుల పద్మ, ఎం సునీత, ఎదుళ్ళ కవిత, కోరే లలిత, అరుణ యాదమ్మ, మమత, సైదా బేగం విజయమ్మ దుర్గమ్మ అరుణ ,కలమ్మ తదితరులు పాల్గొన్నారు.