సూర్యాపేటలో మరో  నయీమ్ వట్టే జానయ్య యాదవ్ వెంటనే అరెస్టు చేయాలి

  • వట్టే జానయ్య యాదవ్ బయట ఉంటే మాకు ప్రాణం ఉంది
  • సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్ లో రాస్తారోకో చేసిన వట్టే జానయ్య యాదవ్ బాధితులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-అన్యాయంగా అక్రమంగా బెదిరించి భయపెట్టి తమ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా డి సి ఎం ఎస్ చైర్మన్ 
వట్టే జానయ్య యాదవ్ తమ భూములు లాక్కున్నాడని భూమిపైకి రాకుండా రౌడీ లను గుండాలను తమ పైకి ఉసిగొల్పుతున్నాడని వట్టే జానయ్య యాదవ్ బాధితులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం సూర్యాపేటలోని జనగాం క్రాస్ రోడ్డు వద్ద వారు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో బాధితులు భూములు కోల్పోయిన వారు ఉగ్గం బుచ్చి రాములు రామసాని సునీత (దుర్గా భవాని హోటల్) ప్రభుత్వ ఉపాధ్యాయుడు వల్లెం శేఖర్ శ్రీనివాస్ ఉప్పల చారి రాంప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన తుపాకితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ డబ్బులు పెట్టి కొనుక్కున్న మా భూముల్లోకి మమ్ములను రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని  ఆవేదన వ్యక్తం చేశారు. గత పది ఏళ్లుగా వట్టే జానయ్య యాదవ్ వల్ల తాము నరకం అనుభవించామని ఇన్నాళ్లకు ఆయన దురాగతాలు ఒక్కొక్కటి బయట పెట్టే అవకాశం వచ్చిందని ఇన్ని రోజులు ప్రాణభయంతో సూర్యాపేట ను వదిలి పలు ప్రాంతాల్లో దాక్కున్నామని వారు కన్నీరు మున్నీరు అయ్యారు.

వట్టే జానయ్య యాదవ్ తో పాటు అతని కుమారులు అనుచరులు తాగి వచ్చి నానా బూతులు తిడుతూ మా భూముల్లో మేము నిలబడ్డప్పటికీ వెళ్లకుంటే  కాల్చివేస్తామని బలవంతంగా దౌర్జన్యంగా బెదిరించి సూర్యాపేటలో కనిపిస్తే చంపేస్తామని భయపెట్టారని అన్నారు వేలాది ఎకరాలను అక్రమంగా ఆక్రమించి ఇదేమని ప్రశ్నించిన భూ యజమానులను పట్టాదారులను ఖతం చేస్తామని  వట్టే జానయ్య యాదవ్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడని పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టిన పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చిన తమను పట్టించుకున్న వారు గాని ఆదుకున్న వారు గాని లేరని వాపోయారు. బీసీలు అంటున్నారని తామంతా బీసీ ఎస్సీ ఎస్టీలమని వారు స్పష్టం చేశారు. ఆర్ కృష్ణయ్య వట్టే జానయ్య యాదవ్ ను వెనకేసుకుని వస్తు మాట్లాడటం సరికాదని విలేకరులు తీన్మార్ మల్లన్న వెలుగు రఘు లు కూడా జానయ్య యాదవ్ అక్రమాలను అన్యాయాలను వెతికి వెలికి తీయాలని, బాధితుల పక్షాన ఉండకుండా భూ కబ్జా కోరుకు మద్దతు ఇచ్చేలా మాట్లాడటం చానల్స్ లో చెప్పడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్య తీన్మార్ మల్లన్న వెలుగు రఘు లు ఆయనకే వత్తాసు పలుకుతున్నారని కనీసం సూర్యాపేట విలేకరులైన తమ గురించి తమ బాధల గురించి కష్టాల గురించి రాసి వాస్తవాలు అర్థం చేసుకొని మా భూములు మాకు వచ్చేలా చేయాలని వేడుకొన్నారు.

మా భూములు మాకు వచ్చేలా ఎంతవరకైనా పోరాడుతామని జిల్లా ఎస్పీని కలిసామని అవసరమైతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవటానికి కూడా వెనకాడమని ఈ విషయంలో అధికారులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అప్పులు తెచ్చి భూములు కొని భూములు పోయి అప్పులు మిగిలిపోయాయని,వట్టే జానయ్య యాదవ్ బెదిరింపుల వల్ల సూర్యాపేటలో నివసించే పరిస్థితి లేదని జిల్లా ఎస్పీ కలెక్టర్లు సత్వరమే చర్యలు తీసుకొని వట్టే జానయ్య యాదవ్ అతని కుమారులు అనుచరులను అరెస్టు చేయాలని లేని పక్షంలో మా భూములు మాకు కావాలన్నా పాపానికి తమకు చావే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జానయ్య యాదవ్ అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయని పక్షంలో రేపటినుండి ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉన్నామని వారు  హెచ్చరించారు. ఇంకా ఈ రాస్తారోకోలో వట్టె జానయ్య యాదవ్ బాధితులు లక్ష్మణ్  రహీమున్నీసా యాదగిరి కృష్ణ ఖమ్మం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో వల్ల హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడగా వెంటనే పోలీసులు వచ్చి  ఏఎస్ఐ వెంకన్న (పాండు )ఆధ్వర్యంలో  ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.