విజయభేరి బహిరంగ సభను దిగ్విజయం చేయాలి - పటేల్ రమేష్ రెడ్డి

విజయభేరి బహిరంగ సభను దిగ్విజయం చేయాలి - పటేల్ రమేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: 17వ తేదీన తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం  సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ కమిటి అధ్వర్యంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్ తుక్కుగూడలో AICC తలపెట్టిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం 
భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో నిర్వహించడం మన రాష్ట్ర అదృష్టం అని అన్నారు.CWC సమావేశానికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు  మల్లికార్జునఖర్గే  అధ్యక్షతన పార్లమెంట్ సభ్యురాలు  సోనియా గాంధీ,భావి భారత ప్రధాని పార్లమెంట్ సభ్యులు  రాహుల్ గాంధీ, AICC జనరల్ సెక్రెటరీ భారత జాతీయ మహిళా కాంగ్రెస్ నాయకురాలు  ప్రియాంక గాంధీ  భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు 17 సెప్టెంబర్ న హైదరాబాద్ కి వస్తున్న సందర్భంగా నిర్వహించనున్న విజయభేరి సభను అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని దిగ్విజయం చేయాలన్నారు.

అనంతరం జరిగిన విజయభేరి సన్నాహక
సమావేశాన్ని ఉద్దేశించి రమేష్ రెడ్డి మాట్లాడుతూ 1885 లో డిసెంబర్ 28న 72 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి కేంద్రంలో ఐదు దశాబ్దాల  పాలనలో దేశాన్ని ఆర్థికంగా , వైజ్ఞానికంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో నిలబెడుతూ ఒకవైపు విద్యా , వైద్య రంగాల్లో అదేసమయంలో వ్యవసాయ, పారిశ్రామికరంగాల్లో ఎంతో అభివృద్ధి చెంది అగ్రదేశాల సరసన ప్రపంచ యావనికలో భారత దేశం  ప్రత్యేకతను చాటి చెప్పి ఆర్థిక సంస్కరణలతో ప్రపంచ విపనిలో కి ప్రవేశించేందుకు కాంగ్రెస్ పార్టీ పాత్ర అనిర్వచనీయం, అమోఘం అని అన్నారు. కాంగ్రెస్ నాయకుల త్యాగాలు ఈదేశ పురోభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి అని కొనియాడారు.

స్వతంత్ర సంగ్రామంలో 62 సం,, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య  పోరాటం చేసి ధన,ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్య్రం వచ్చి 76 సం॥లో 100% అభివృద్ధిని సాధించి బిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగంగా ఉన్న అదే రాజ్యాంగ స్ఫూర్తి తో కాంగ్రెస్ పార్టీ ఆత్మ సిద్ధాంతంగా నేటికి దేశ క్షేమం కోసం కాంగ్రెస్ నాయకులు తమ జీవితాన్ని దేశం కోసమే సాగిస్తుండడం అభినందనీయం అని అన్నారు. అలాంటి నాయకుల వారసత్వంగా నేటి భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మునుముందు ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేస్తుందని  రమేష్ రెడ్డి అన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల నాయకులు పెద్దిరెడ్డి రాజా ముదిరెడ్డి రమణారెడ్డి మోదుగు నాగిరెడ్డి గోదల రంగారెడ్డి గట్టు శ్రీనివాస్ ఫారుక్ వెంకన్న యాట ఉపేందర్ నామ వేణు స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.