భారీగా మద్యం పట్టివేత

భారీగా మద్యం పట్టివేత

ముద్ర.వీపనగండ్ల:-అక్రమంగా మద్యాన్ని నిలువ చేసిన ఇండ్లపై దాడులు చేసి ఆ వ్యక్తుల నుంచి  మద్యం కాటన్ లను స్థానిక పోలీసులు ప్లయింగ్ స్కాట్ టీమ్స్  స్వాధీనం చేసుకొని   కేసు నమోదు చేసిన ఘటన చిన్నంబావి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మండలంలోని చిన్న దగడ గ్రామానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి ఇంట్లో 29 కాటన్ల ఐబి లిక్కర్ రెండు లక్షల 50 వేల 600 రూపాయలు విలువ చేసే మద్యం, అదే గ్రామానికి చెందిన సుగురు శంకరయ్య అనే వ్యక్తి నుంచి 16 కాటన్లు 1,38,240 రూపాయలు విలువ చేసే చేసే ఐబి లిక్కర్, దేవమ్మ మహిళ నుంచి మూడు కాటన్ లు 29 వేల 920 రూపాయల విలువచేసే ఐబి లిక్కర్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చిన్నంబావి ఎస్సై కృష్ణఓబులారెడ్డి, వీపనగండ్ల ఎస్ఐ రవి ప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రారెడ్డి, స్పెషల్ స్క్వాడ్ టీమ్స్ పాల్గొన్నారు