కోరవడిన నాయకుల మధ్య సఖ్యత

కోరవడిన నాయకుల మధ్య సఖ్యత
  •  వర్గ పోరుతో భాజాపాకు తప్పని తిప్పలు..                   
  • ఎవరికివారుగా అభినందనలు
  • గత ఫలితాలే పునరావృత్తమా
  • నాయకత్వ మార్పు కోరుకుంటున్న యువత

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా :  భారతీయ జనతా పార్టీలో వర్గపోరుతో గత శాసనసభ ఎన్నికలలో వచ్చిన ఫలితాలే పునరావృత్తం అవుతాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు యువత మరియు మేధావులు మొగ్గుచూపుతున్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం పార్టీ అభివృద్ధిపై దృష్టి స్వల్పకపోవడంతో ఏక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందని ఆ పార్టీలోని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత శాసనసభ ఎన్నికల ముందు గగ్గలపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వ్యక్తి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమై నియోజకవర్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సమయంలో గతంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన దిలీప్ ఆచారి రంగంలోకి దిగి టిక్కెట్టును దక్కించుకోవడంతో సదరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత హైదరాబాదుకే పరిమితమయ్యారు ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమాతో ప్రచార నిర్వహించిన ఎన్నికల ఫలితాలలో మాత్రం ఆ పార్టీకి ఊహించినంత ఫలితం దక్కకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి.

5000 ఓట్లలోపే భాజాపాకు ఓట్లు రావడంతో అన్ని వర్గాలలో చర్చ మొదలైంది ఆ తదుపరి పార్టీ కార్యక్రమాలలో కొంత స్తబ్దత ఏర్పడినప్పటికీ వాటిని వేగవంతం చేసేందుకు గతంలో పోటీ చేసిన అభ్యర్థికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన పార్టీ అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించకపోవడంతో నియోజకవర్గంలో పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు మునిసిపాలిటీ ఎన్నికలలో అన్ని వార్డుల నుండి పోటీ చేసిన ఏ ఒక్కరు కూడా గెలుపొందకపోవడం గమనార్హం. గత కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి భాజపాలో చేరిన మాజీ జడ్పిటిసి కొండా మణెమ్మ నగేష్ దంపతులు కొద్ది రోజులుగా కార్యక్రమాలను వేగవంతం చేశారు రాబోయే ఎన్నికల బరిలో పార్టీ తమను అభ్యర్థిగా ప్రకటిస్తుందని ఆశించి ముందుకు సాగుతున్న తరుణంలో వారికి ప్రోటోకాల్ లేదనే కారణంతో జిల్లా నాయకత్వం వారిని కొంత దూరం పెట్టడం జరిగింది అయినప్పటికీ జాతీయ రాష్ట్ర పిలుపులను విజయవంతం చేయడంలో వారు కొంత కృషి చేశారు. పార్టీ పిలుపుమేరకు ఇటీవల నిర్వహించిన కార్నర్ సమావేశాలలో కూడా గ్రామాలలో బిజెపి సభలకు ప్రజల స్పందన కరువైంది.

ఆ పార్టీపై సదాభిప్రాయం కలిగిన యువత కూడా నాయకుడు మార్పుతో కొంతమంది ఫలితాలు రావచ్చు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైనప్పటికీ నియోజకవర్గం నుండి జన సమీకరణ జరగలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ సభ విజయవంతం కావడం పట్ల ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు నేతల మధ్య అధిష్టానం సఖ్యత కుదుర్చుతేనే పార్టీ కొంత బలోపేతం అయ్యే అవకాశం ఉందని దీనిపై దృష్టి సారించాలని చర్చ సాగుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా ఒక వర్గానికి వత్తాసు పలుకుతున్నట్లు చర్చ సాగుతుంది ఇటీవల పార్టీ నుండి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఒక నాయకుడిని తొలగించడం కూడా పార్టీకి తీరని లోటు అని గుసగుసలు వినిపిస్తున్నాయి