అన్నా అన్నా కే ఏ పాలన్నా అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేఏ పాల్ ఎన్నికల సాంగ్

అన్నా అన్నా కే ఏ పాలన్నా అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేఏ పాల్ ఎన్నికల సాంగ్

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఏ పాల్.. తన ఎన్నికల ప్రచార పాటను విడుదల చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను విమర్శిస్తూ ఈ పాట సాగింది. ఏపీకి పాల్ ఎందుకు కావాలనే అంశాన్ని ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఈ పాటను రూపొందించారు. కాగా విశాఖ నుంచి పాల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీకి కుండా గుర్తును ఈసీ కేటాయించిన విషయం తెలిసిందే.

అన్నా అన్నా అన్నా అన్నా కే ఏ పాలన్నా

నీదే గొప్ప పాలన అన్నా

నువ్వే మాకు కావాలన్నా అన్నా

అన్నా అన్నా అన్నా కే ఏ పాలన్నా

ఇచ్చావు ఇస్తావన్నా

చేసావు చేస్తావన్నా అన్నా అన్నా

అన్నా అన్నా కే ఏ పాలన్నా

దేవుడు పంపిన దూతవి అన్నా

తుప్పు సైకిల్లు మాకొద్దన్నా

పగిలే గ్లాసులు మాకొద్దన్నా

తిరగని ఫ్యానులు మాకొద్దాన్నా

వాడే పువ్వులు మాకొద్దన్నా అన్నా

అన్నా అన్నా అన్నా కే ఏ పాలన్నా

మా పాలిట దేవుడివన్నా

మలినం లేని మట్టి కుండలా

చల్లనైన కుండ నీళ్లలా

స్వచ్ఛమైన గోమాత పాలలా

పాలన్నే మాక్కావాలన్నా

అన్నా అన్నా అన్నా అన్నా కే ఏ పాలన్నా

ఈ పాలన మారాలన్నా