కేసముద్రం మార్కెట్ లో కాలు పెట్టే వశం లేదు!

కేసముద్రం మార్కెట్ లో కాలు పెట్టే వశం లేదు!
  • 50వేల బస్తాల వ్యవసాయ ఉత్పత్తుల రాక
  • వ్యవసాయ ఉత్పత్తులతో నిండిన మార్కెట్

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ ఉత్పత్తులతో నిండి కాలుపెట్టే వశం లేకుండా పోయింది. మార్కెట్లో ఉన్న ఫుల్ కవర్ షెడ్లు నిండిపోవడంతో పాటు ఓపెన్ యార్డ్ పూర్తిగా ధాన్యం మక్కజొన్నలతో నిండిపోయింది. శని ఆదివారాలు వారాంతపు సెలవుల కారణంగా మార్కెట్ బందు ఉండడంతో సోమవారం పునః ప్రారంభించగానే సుమారు 50 వేల వేల బస్తాల ధాన్యం, మక్కజొన్న ఇతర వ్యవసాయ ఉత్పత్తులను రైతులు విక్రయానికి తెచ్చారు. దీనితో 16 ఎకరాలకు పైగా ఉన్న కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డు పూర్తిగా వ్యవసాయ ఉత్పత్తులతో నిండి పోయింది. కొద్దిపాటి స్థలం ఖాళీగా లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు రాశులుగా పోయడంతో మార్కెట్ కు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులన్నీ క్రయవిక్రయాలు ఎగుమతులు పూర్తి చేయడానికి ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు ఇంత పెద్ద ఎత్తున సరుకులు రావడం ఇదే ప్రధమమని, వ్యవసాయ ఉత్పత్తులు రైతులతో మార్కెట్ జాతరను తలపిస్తోంది.