అన్యాక్రాంతమైన 4 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం

అన్యాక్రాంతమైన 4 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం

ముద్ర ప్రతినిధి, బీబీనగర్:  మండలంలోని పడమటి సోమారం గ్రామంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పడమటిసోమారం గ్రామంలో సర్వే నంబర్ 254/లూ 2.05 ఎకరాలు బాగరి లింగెయ్య, 254/ఎ 0.03 గుంటలు, 256/ఇ 1:36 ఎకరాలు యాకరి దేవయ్య మొత్తం 4:10 (4ఎకరాల 10 గుంటలు) అనే రైతులకు 1978 సంవత్సరంలో సేద్యం చేసుకోవడానికి ప్రభుత్వం భూమిని కేటాయించింది. లబ్దిదారుల నుంచి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ భూమిని తీసుకుని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్లాట్లను చేసి విక్రయించింది.

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చిన 4:10 భూమిని రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్ డిఓ అమరేందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీధర్ గురువారం స్వాదీనం చేసుకున్నారు. పట్టాదారుల కుటుంబ సభ్యులకు నోటీసులను అందజేసి స్వాదీనం చేసుకున్న భూమికి హద్దు రాళ్ళను నిర్ణయించి ఫెన్సింగ్ వేస్తామని తెలిపారు. ఇంకా ఆ సంస్థ ఆదీనంలో ఉన్న ప్రభుత్వ సీలింగ్ భూములను స్వాదీనం చేసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూములు ఎక్కడ అన్యాక్రాంతమైనా సహించేది లేదని, వాటిని స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ శ్రీధర్ తెలిపారు.