హిందూ సంప్రదాయాలను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి 

హిందూ సంప్రదాయాలను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి 

ముద్ర, కోరుట్ల: హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కించపరిస్తే ఎలాంటి కేసులు ఉంటాయో అట్టి కేసులు పెట్టే వరకు పోరాడుతామని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ స్పష్టం చేశారు. గురువారం కోరుట్ల పట్టణంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న కోరుట్ల మున్సిపల్ విలీన గ్రామమైన ఎకిన్ పూర్ లోని వాట్సాప్ గ్రూప్ 20 - 20 అనే దానిలో సింగిల్ విండో కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సీఈవో మహమ్మద్ తాజుద్దీన్ బాబా హిందూ సంప్రదాయాలను హిందువుల పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి, సత్యనారాయణ స్వామి వ్రతాలను తీవ్రంగా అవమానిస్తూ వాట్సాప్ లో సందేశాన్ని పోస్ట్ చేశారన్నారు, అసభ్యకరమైన మెసేజ్ పెట్టిన తాజుద్దీన్ బాబాపై ఈ నెల 19వ తేదీ భాజపా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తాజుద్దీన్ బాబాపై నామమాత్రపు కేసులు పెట్టి అట్టి అసభ్యకరమైన మెసేజ్ ను ప్రోత్సహించిన అడ్మిన్ ను తప్పించి హిందువుల మనోభావాలను హిందువుల సంస్కృతి సంప్రదాయాలను అవమానించినప్పటికీ వారు ఇష్టారాజ్యంగా పొరపాటు ఒకటైతే మరో రకమైన కేసులు పెట్టి హిందువులను పక్కతోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

నాలుగు రోజుల నుండి పోలీసులకు ఫిర్యాదులు అందినప్పటికీ పూర్తిస్థాయిలో స్పందించడం లేదని ఇకనైనా వాస్తవాలు గ్రహించి చట్టం అందరికీ ఒకే రకంగా ఉంటుందని దానినే ఆచరించాలని అతడు పంపించిన మెసేజ్ లకు చట్ట ప్రకారం ఎలాంటి కేసులు పెట్టవచ్చో అవే కేసులు పెట్టాలని  అడ్మిన్ పై తప్పకుండా కూడా కేసు నమోదు చేసే వరకు భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాల తో కలిసి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరికి ఎవరి పై శత్రుత్వం లేదని ద్వేషాలు అంతకన్నా లేవని అన్ని మతాలవారు అందరిని గౌరవించాలనే అభిప్రాయం మాకు ఉందని మేము ఎప్పుడు ఇతర మతాల వారిని అగౌరవపరచలేదని పోలీసులు ఇట్టి విషయంలో వాస్తవాలను గ్రహించి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా 22వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవెని నరేష్, కిషన్ మోర్చా పట్టణ అధ్యక్షులు ఎల్లాల నారాయణరెడ్డి, భాజాపా మాజీ పట్టణ అధ్యక్షులు చిరుమళ్ళ ధనుంజయ్, ప్రధాన కార్యదర్శి చెట్లపెల్లి సాగర్, ఇట్యాల నవిన్, ధమ్మ సంతోస్, మల్లేశం, బాజపా నాయకులు పాల్గొన్నారు.