66 మంది బాల కార్మికులకు విముక్తి - ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

66 మంది బాల కార్మికులకు విముక్తి - ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆపరేషన్ ముస్కాన్ -9 బృందం దాడులలో 66 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు. బాలురు 58 మంది, బాలికలు 8 మంది ఉన్నారు. 4 కేసులు నమోదు చేసినట్లు రోహిణి ఎస్పీ ప్రియదర్శిని వెల్లడించారు. మెదక్ జిల్లా ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ బృందం,  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, సఖి సెంటర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారులు సంయుక్తంగా  ఆపరేషన్ ముస్కాన్- IX బృందం దాడులు  కిరాణాలు, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ వదిలివేయబడిన పిల్లలు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు, బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించి 66 మంది బాల బాలికలని పట్టుకుని సంబందిత అధికారుల ద్వారా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించామన్నారు.