వ్యవసాయం చేసుకోవడానికి  గజం భూమి లేదు..!

వ్యవసాయం చేసుకోవడానికి  గజం భూమి లేదు..!
  • ఉండడానికి ఇల్లు లేదు..!
  • ఉన్న ఊరిలోనే అద్దెకు ఉంటూ కాలం వెళ్లదీస్తున్న వైనం.!
  • ఇప్పటికే మూడు లక్షల రూపాయలు అప్పుచేశను..
  • జీర్ణించుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా వైనం!

ముద్రా షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డి గూడ గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత మూడు సంవత్సరాల క్రితం వర్ష బీభత్సానికి ఇల్లు కూలిపోవడంతో ఉన్న సొంత ఊరిలోనే  కిరాయి ఇంట్లో అద్దెకు ఉంటూ  జీవనం సాగిస్తున్నాడు ఉండడానికి ఇల్లు లేక వ్యవసాయం చేసుకోవడానికి  గజం భూమి లేక కూలీనాలీ చేసుకొని జీవనం సాగిస్తున్నా క్రమంలో  ఇప్పటికే  ఇంటి కిరాయి (అద్దె) చెల్లించక  పది నెలలు అవుతుంది  వారు అద్దె కట్టక పోతే ఇల్లు  కాళీ చేయాలని చెబుతున్నారని మనస్థాపానికి గురైన బాధితుడు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు ఇప్పటికే మూడు లక్షల రూపాయల వరకు అప్పులు చేశానని మనస్థాపానికి గురైన నారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు నారాయణకు ఓ కూతురు కూడా ఉంది..